LRS లేకుండానే రిజిస్ట్రేషన్లు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

Tuesday, December 29th, 2020, 08:10:49 PM IST

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లాట్ల రిజిష్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధన ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో అనుమతి పొందిన ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసుకునేలా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే కొత్త లేఅవుట్లకు మాత్రం సంబంధిత సంస్థల అనుమతులు పొందిన తరువాతే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. అయితే ఇన్నిరోజులు రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందిపడుతున్న ప్రభుత్వ నిర్ణయంతో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు లైన్ క్లియరైంది.