ఆక్సిజన్ కోసం యుద్ద విమానాలను వినియోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం!

Friday, April 23rd, 2021, 03:56:06 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తెలంగాణ రాష్ట్రం లో కొనసాగుతునే ఉంది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఊహించని రీతిలో ఉండటం తో పాజిటివ్ కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం అలెర్ట్ అవ్వడం తో ఆక్సిజన్ కోసం యుద్ద విమానాలను వినియోగిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆక్సిజన్ సరఫరా కోసం యుద్ద విమానాలను వినియోగిస్తున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఆక్సిజన్ ట్యాంకర్ల తో కూడిన యుద్ద విమానాలు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్ వరకూ కి బయలు దేరాయి అని ఈటెల రాజేందర్ అన్నారు. అక్కడి నుండి 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుంది అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే దీని కోసం 8 ఖాళీ ట్యాంకు లను హైదరాబాద్ నుండి తీసుకు వెళ్ళారు అని తెలిపారు. అయితే ఇలా ఆక్సీజన్ ను తీసుకొచ్చేందుకు యుద్ద విమానాలను తొలి సారిగా ప్రభుత్వం వినియోగించింది అని అన్నారు.