కరోనా టెస్టుల విషయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Thursday, August 6th, 2020, 01:00:44 AM IST

Corona_positive
తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే దేశం లో పలు చోట్ల కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ను మళ్లీ పలు చోట్ల అమలు చేస్తున్నారు. తెలంగాణ లో మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇదే పరిస్తితి. అయితే కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు మాత్రం ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువే అని చెప్పాలి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

కనీసం రోజుకి 40 వేల కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించాలి అని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. బుధవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆగస్ట్ 4 న 21,000 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే రోజుకి 40 వేలకు పెంచడం పట్ల పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఖ్య కూడా చాలా తక్కువే అని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మరింత కృషి చేయాలని కొందరు చెబుతున్నారు.