నేటి నుండి తెలంగాణ లో విద్యా సంస్థలు బంద్

Wednesday, March 24th, 2021, 08:45:34 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత మళ్ళీ పెరుగుతోంది. అయితే రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్ళీ ఎక్కువగా నమోదు అవుతుండటం తో పాటుగా, పక్క రాష్ట్రాల లో ఎక్కువ కేసులు నమోదు కావడం పట్ల ప్రభుత్వం అప్రమత్తం అయి తాత్కాలికం గా విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఒక్క వైద్య కళాశాల లకు మినహా మిగతా అన్ని విద్యా సంస్థలు నేటి నుండి మూత పడనున్నాయి.అయితే మళ్ళీ ఆన్లైన్ క్లాసులు మొదలు కానున్నాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ప్రకటన తో తెలంగాణ రాష్ట్రం లో హాస్టళ్లు, గురుకులాలు, పాటశాలకు మూత బడ్డాయి.