బిగ్ న్యూస్: మరొకసారి కోవిడ్ ఆసుపత్రి గా గాంధీ

Friday, April 16th, 2021, 05:29:05 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రం లో ఎక్కువగా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఎక్కువ గా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత మునుపటి కంటే రెట్టింపు తీవ్రత కలిగి ఉండటం తో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మహమ్మారి తీవ్రత కారణంగా ఇప్పటి కే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ మార్గాన్ని మళ్ళీ అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దీని తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రం లో పెరుగుతున్న నేపథ్యం లో మరొకసారి గాంధీ ఆసుపత్రి ను కోవిడ్ ఆసుపత్రి గా మారుస్తూ ఆదేశాలను జారీ చేశారు. అయితే రేపటి నుండి పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రి గా గాంధీ ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే శనివారం నుండి ఓపిను నిలిపి వేయాలని సర్కారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.