లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు – డీజీపీ

Wednesday, May 12th, 2021, 07:33:25 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రం లో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్రం లోని పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో సీపీ లు, సీఐ లు, డిఐజి స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండాలని ఆదేశించారు. అయితే పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. అయితే రెండవ డోస్ వాక్సిన్ కోసం వెళ్ళే వారికి, మొదటి డోస్ వాక్సిన్ సమాచారం చూపించిన వారికి అనుమతి ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే నిత్యావసర వస్తువుల రవాణా, అత్యవసర సేవలకు పాసులు జారీ చేయాలని సూచించారు. అయితే అత్యవసర ప్రయాణాలకు సిపి లు, ఎస్పీ లు పాస్ లు జారీ చేయాలని అన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు తమ గుర్తింపు కార్డ్ లను వెంట ఉంచుకోవాలి అని అన్నారు. అయితే వివాహాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ పాస్ ల కోసం policeportal.tspolice.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు. అయితే లాక్ డౌన్ సడలింపు వేళల్లో కాకుండా, ఇతర సమయాల్లో ప్రయాణాలకే పాస్ లు అవసరం అని అన్నారు.