సినీమా థియేటర్ల మూసివేత పై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Wednesday, March 24th, 2021, 02:32:34 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. దాదాపు 300 మంది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ మేరకు కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి అయితే ఈ మేరకు సినిమా థియేటర్ల గురించి సైతం పలు వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సినిమటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో సినిమా థియేటర్లు యధావిధిగా కొనసాగుతాయి అని వ్యాఖ్యానించారు. అయితే ధియేటర్లు అన్ని మూసివేస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది అని, అవన్నీ అవాస్తవాలు అంటూ కొట్టి పడేశారు. అలాంటి పుకార్లను నమ్మవద్దని తెలిపారు. థియేటర్ల మూసివేత పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తేల్చి చెప్పారు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ కి ఎంతో నష్టం వాటిల్లింది అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీ నే నమ్ముకున్న ఎంతోమంది చిన్న నటీనటులు, కార్మికులు రోడ్డున పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి అని తెలిపారు. అయితే ఇలా దియేటర్ల ను మూసివేస్తారు అంటూ జరిగిే అవాస్తవ ప్రచారం ఆపేయ్యండి అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.