నేరేడ్మెట్ లో తెరాస విజయం

Wednesday, December 9th, 2020, 11:34:14 AM IST


నేరేడ్మెట్ లో తెరాస విజయం సాధించింది. మొత్తం 782 ఓట్ల తో తెరాస అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. అయితే ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లలో తెరాస కి 278 ఓట్లు వచ్చాయి. అయితే తెరాస మరొక కీలక స్థానం లో విజయం సాధించడం తో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస సాధించిన స్థానాలు 56 కి చేరింది. అయితే ఇక్కడ తెరాస విజయం సాధించడం తో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరొక కీలక పార్టీ బీజేపీ ఈ ఎన్నిక ఫలితం పట్ల నిరుత్సాహం తో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తిరస్కరణ కి గురి అయిన మొత్తం 1300 ఓట్లను లెక్కించాలి అని బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు డిమాండ్ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయి అని, అధికార పార్టీ కి ఎన్నికల అధికారులు అనుకూలం గా వ్యవహరించి, 600 కి పైగా చెల్లని ఓట్లను తెరాస ఖాతా లో వేశారు అంటూ ఆరోపిస్తున్నారు. అయితే తెరాస మాత్రం ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది.