గ్రేటర్ లో దూసుకుపోతున్న కారు… వెల్లడవుతున్న ఫలితాలు!

Friday, December 4th, 2020, 12:56:22 PM IST

తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ ఓట్లలో వెనుకంజ లో ఉన్న అధికార పార్టీ తెరాస, బ్యాలెట్ ఓట్ల తో జోరు కనబర్చింది. తెరాస ఇప్పటి వరకూ 40 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఎం ఐ ఎం 21 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుండగా, బీజేపీ 23 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది.

అయితే బీజేపీ పోస్టల్ ఓట్లలో ఆధిక్యాన్ని కనబరచడం విశేషం కాగా, ఇప్పటి వరకు తెరాస రెండు స్థానాల్లో గెలుపొందగా, ఎం ఐ ఎం రెండు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం లో విజయం సాధించింది.