గ్రేటర్‌ ఎలక్షన్స్: టీఆర్ఎస్ అభ్యర్థుల రెండో జాబితా..!

Thursday, November 19th, 2020, 03:46:24 PM IST

గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో వేగంగా దూసుకుపోతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నిన్న రాత్రి 105 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి జాబితాలో సిట్టింగ్‌లకే మరో సారి అవకాశం ఇచ్చినట్టు కనిపించింది. అయితే తాజాగా టీఆర్ఎస్ పార్టీ తన రెండో జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో మరో 20 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే మొత్తం మీద ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ 125 మంది అభ్యర్థులను ఖరారు చేయగా మరో 25 మంది పేర్లు ప్రకటించాల్సి ఉంది.

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా

1) మల్లాపూర్ – దేవేందర్ రెడ్డి,
2) రామంతపూర్ – గంధం జ్యోత్స్న,
3) బేగం బజార్ – పూజావ్యాస్ బిలాల్,
4) సులేమాన్ నగర్ – ఏ సరితా మహేష్
5) శాస్త్రిపురం – బి. రాజేష్ యాదవ్,
6) మైలార్ దేవ్ పల్లి – టి. ప్రేమ్ దాస్ గౌడ్,
7) రాజేంద్రనగర్ – కొరని శ్రీలత,
8) హిమాయత్ నగర్ – హేమలతా యాదవ్,
9) బాగ్ అంబర్ పేట్ – పద్మావతి రెడ్డి,
10) భోలక్ పూర్ – బింగి నవీన్ కుమార్,
11) షేక్ పేట్ – ఎం సత్యనారాయణ యాదవ్,
12) శేరిలింగంపల్లి – రాగం నాగేంద్ర యాదవ్,
13) బాలానగర్ – రవీందర్ రెడ్డి ఆవుల,
14) కూకట్ పల్లి – సత్యనారాయణ జూపల్లి,
15) వివేకానంద నగర్ కాలనీ – మాధవరం రోజా రంగారావు,
16) వినాయక్ నగర్ – బద్దం పుష్పలతారెడ్డి,
17) అడ్డగుట్ట – ప్రసన్న లక్ష్మి,
18) మెట్టుగూడ – రాసూరి సునీత,
19) బౌద్ధనగర్ – కంది శైలజ,
20) బేగంపేట్ – మహేశ్వరి శ్రీహరి