దుబ్బాకలో కారు జోరు.. నెమ్మదిగా పెరుగుతున్న టీఆర్ఎస్ అధిక్యం..!

Tuesday, November 10th, 2020, 03:16:41 PM IST

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌లో మొదట్లో కాస్త వెనకబడిన కారు జోరందుకుంది. వరుసగా 13,14,15,16,17,18,19 రౌండ్లలో అధిక్యం కనబరిచిన టీఆర్ఎస్ 19వ రౌండ్ పూర్తయ్యే సమయానికి 251 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే పోస్టల్‌ ఓట్లతో కలిపి ప్రస్తుతం టీఆర్ఎస్ 603 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 19వ రౌండ్ పూర్తయ్యే సమయానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 53,053 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 52,802 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 18,365 ఓట్లు లభించాయి. ఇక మొత్తం 23 రౌండ్లు కౌంటింగ్ ఉండగా ఇంకా నాలుగు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉండడంతో అందరిలో మరింత ఉత్కంఠ ఏర్పడింది. అయితే ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధించినా మెజార్టీ మాత్రం చాలా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది.