ఎం ఐ ఎం తో పొత్తు లేకుండానే మేయర్ పీఠం కోసం తెరాస వ్యూహం?

Sunday, December 6th, 2020, 11:15:30 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస 55 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తరువాత స్థానాల్లో బీజేపీ 48, ఎం ఐ ఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. అయితే నేడు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే లతో భేటీ అయిన మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల గురించి కీలక చర్చ జరిపారు. అనంతరం గెలిచిన కార్పొరేటర్ల తో సమావేశం అయ్యారు. అయితే గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. అయితే మేయర్ పీఠం గురించి దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈసారి మజ్లిస్ పార్టీ తో పొత్తు లేకుండా మేయర్ పీఠం దక్కించుకునేలా వ్యూహం వేస్తున్నట్లు తెలుస్తోంది. గెలిచిన కార్పొరేటర్లు ప్రజల్లో ఉండి, ప్రజల్లో ఉండాలి అని మంత్రి కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పీఠం కోసం కసరత్తులు చేస్తున్నారు తెరాస నేతలు. అయితే ఇందుకోసం ప్రత్యేక చట్టాలను పరిశీలిస్తున్నట్ల తెలుస్తోంది. అయితే తెరాస వ్యూహాలను బీజేపీ ఈ ఎన్నికల్లో వొమ్ము చేసిన సంగతి తెలిసిందే.