నా మాట ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఏడ్చేసిన టీఆర్ఎస్ ఎంపీపీ..!

Wednesday, November 4th, 2020, 10:42:56 PM IST

ఏదైనా ఒక్క పదవి ఉంటే చాలు ఇక నేను చెప్పిందే ఏదం అనేలా వ్యవహరిస్తుంటారు కొంత మంది నేతలు. ఇక పదవితో పాటు అధికారంలో కూడా తమ పార్టీనే ఉంటే ఏ పనినైనా చిటికెలో చేయించుకుటారు. అయితే ఇది అందరికి తెలిసిందే కొత్తగా ఏదైనా ఉంటే చెప్పండి అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ అధికార పార్టీకి చెందిన మహిళా నాయకురాలు విషయంలో మాత్రం ఈ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది.

తన మాట ఎవరూ వినిపించుకోవడం లేదంటూ మీడియా ముందే బోరున విలపించింది. ములుగు జిల్లా వాజేడు ఎంపీపీ శారద అధికార్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకురాలు. తన మాట ఎవరూ వినడం లేదని వెక్కెక్కి ఏడ్చారు. రైతు వేదికల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తే తన మాట ఎవరు వినడం లేదని, కనీసం తనకు విలువ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని అడిగితే నువ్వెంత, నీ వయసెంత అని హేళనగా మాట్లాడారని ఈ విషయాన్ని జడ్పీ ఛైర్మన్, పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.