తెరాస పార్టీ ఎంపీ బీబీ పాటిల్ కి కరోనా వైరస్ పాజిటివ్

Thursday, October 22nd, 2020, 02:16:11 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే వందల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, ఈ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా విడిచి పెట్టడం లేదు. అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీ కి చెందిన నేతల నుండి, ప్రతి రంగం లోని వారు ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. తాజాగా తెరాస కీలక నేత, ఎంపీ బీబీ పాటిల్ కరోనా వైరస్ భారిన పడ్డారు.

అయితే ఎంపీ కరోనా వైరస్ భారిన పడ్డ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది అని, లక్షణాలు చాలా స్వల్పంగా నే ఉన్నాయి అని, అయితే తనను ఇటీవల కలిసిన వారు అంతా కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని కోరారు. ఇప్పటికే పలువురు నేతలు కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.