కరోనాపై పోరాటానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన టీఆర్ఎస్ ఎంపీ..!

Wednesday, March 25th, 2020, 09:00:07 PM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. ఈ తరుణంలో కరోనా వైరస్ మీద పోరాటానికై ప్రభుత్వానికి పలువురు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా టీఆర్ఎస్ నేత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఒక కోటి లక్ష రూపాయలు కేటాయించారు. అయితే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు ఉండగా మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. కాగా సంగారెడ్డి జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలకు 50 లక్షలు, కామారెడ్డి జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీ సెగ్మెంట్లకు 51 లక్షలు కేటాయించారు. ఈ నిధులను కరోనా వైరస్ నివారణ పరికరాలు, మందుల కొనుగోలు కోసం వినియోగించాలని చెప్పారు.