తెరాస ఎమ్మెల్సీ వాణీ దేవి కి కరోనా వైరస్ పాజిటివ్

Monday, March 29th, 2021, 08:40:02 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా విడిచిపెట్టడం లేదు. అయితే తాజాగా తెరాస ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా ఆమె కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను అని వ్యాఖ్యానించారు. అయితే తనను గత కొద్ది రోజులుగా కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అంతా కూడా ఐసోలేశన్ లో ఉండాలని సూచించారు. అంతేకాక కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు కూడా చేయించుకావాలని తెలిపారు. ఇటీవల జరిగిన రంగారెడ్డి – మహబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీ దేవి గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిందే.