సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన పీవీ కుమార్తె..!

Friday, February 26th, 2021, 03:00:36 AM IST


భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని నడిపించింది పీవీ గారైతే, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆమె కొనియాడారు. పట్టుదలతో తెలంగాణను సాధించడమే కాదు రక్షించిన మహానుభావుడు అని అన్నారు.

అయితే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే తనకు పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉందని, తనను గెలిపించాలని కోరారు. ఇదిలా ఉంటే ఇదే స్థానానికి కాంగ్రెస్ తరపున చిన్నారెడ్డి, బీజేపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్‌రావు బరిలో ఉన్నారు.