మేమే గెలుస్తాం.. బీజేపీ ఎమ్మెల్సీనీ రౌండప్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!

Monday, March 15th, 2021, 03:45:30 PM IST

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో పలు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రౌండప్ చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఈ సారి మేమే గెలుస్తున్నామని.. మీకు ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలంటూ వ్యాఖ్యానించారు. మా పార్టీ కండువా కప్పాలా అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ రామచంద్రరావు దగ్గరకు వచ్చారు.. దీంతో ఎల్లుండి ఫలితం చూద్దామని ఆయన సమాధానమిచ్చారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో నిన్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే గతంలో కంటే ఈ సారి ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరగడం, అభర్థుల మధ్య పోటీ కూడా ఎక్కువగా ఉండడంతో ఎవరికి వారు తమ పార్టీనే గెలవబోతుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.