గంగవ్వ విజేతగా నిలుస్తుంది అని ఆశిస్తున్నా – తెరాస ఎమ్మెల్యే

Monday, September 7th, 2020, 05:00:10 PM IST

బుల్లితెర రియాలిటీ షో సిరీస్ అయిన బిగ్ బాస్ ఈ ఏడాది అట్టహాసం గా ప్రారంభం అయింది. అయితే ఇందులోని సభ్యులు అందరూ కూడా ఈ సారి నూతనోత్సాహం తో తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అయితే ఈ రియాలిటీ షో కి వివిధ రకాల కి చెందిన, భిన్న వయసు గల వారు హౌజ్ లోకి అడుగు పెట్టారు. అయితే ఇందులో మొదటి రోజే ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు గంగవ్వ. అభిమానులు సైతం ఈ సారి గంగవ్వ కి మద్దతు ఇచ్చేందుకు సోషల్ మీడియా వేదిక ద్వారా సిద్దంగా ఉండటం మాత్రమే కాకుండా, ఆర్మీ సైతం మొదలు పెట్టారు.

అయితే హౌజ్ లోకి వెళ్ళే ముందు గా, కొంచెం భయం గా ఉంది అంటూ ఒక పోస్ట్ చేశారు గంగవ్వ. అయితే మేము అండగా ఉన్నాం అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే తాజాగా గంగవ్వ బిగ్ బాస్ షోలో పాల్గొనడం పట్ల తెరాస పార్టీ కి చెందిన ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గంగవ్వ కి శుభాకాంక్షలు తెలిపారు. మా చొప్పదండి నియోజక వర్గం అవ్వ గంగవ్వ బిగ్ బాస్ షో లో అడుగు పెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు, మారుమూల పల్లె నుండి, తన మాటలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది అని ఎమ్మెల్యే తెలిపారు. గంగవ్వ విజేతగా నిలుస్తుంది అని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.