గ్రేటర్ రిజల్ట్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీమణి ఓటమి..!

Friday, December 4th, 2020, 06:02:31 PM IST

గ్రేటర్ ఎన్నికలలో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ అధిక్యంలో ఉన్నప్పటికి గతంలో కంటే తక్కువ స్థానాలలో గెలిచింది. అయితే గతంలో కేవలం 4 స్థానాలలో మాత్రమే గెలిచిన బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ సారి 40 స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ పుంజుకోవడం టీఆర్ఎస్‌కు ఒక తలనొప్పి అయితే, టీఆర్ఎస్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లోనూ ఆ పార్టీ ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో ఒకింత విస్మయాన్ని కలగిస్తుంది.

అయితే ఈ క్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భార్య ఓటమిపాలయ్యింది. హబ్సిగూడ డివిజన్‌ నుంచి ఎమ్మెల్యే భార్య స్వప్న పోటీ చేయగా బీజేపీ అభ్యర్థి చేతన చేతిలో పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో స్వప్న విజయం సాధించగా ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఆమెకు ఓటమి తప్పలేదు. అయితే హబ్సిగూడ డివిజన్‌లో 49,007 మంది ఓటర్లున్నారు. ఇందులో 25,401 పురుషులు, 23,605 పురుషులు, 50 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు.