బీజేపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే..!

Wednesday, February 3rd, 2021, 01:47:21 AM IST


తెలంగాణ బీజేపీ నేతలకు మహబూబాబాద్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఆరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని చెప్పుకొచ్చారు. ఈక తోక లేని పార్టీలన్ని ఇస్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాయని అన్నారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదని, యువతను పాడు చేయడం సరికాదని అన్నారు.

అంతేకాదు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి చేయడం సిగ్గు చేటని అన్నారు. రాజకీయంగా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలే తప్పా ఇలా దాడులకు పాల్పడడం మంచి పద్ధతి కాదని అన్నారు. మీరు ఊరికి ఒక్కరే ఇద్దరో ఉన్నారని, మాకు ఎన్ని సభ్యత్వాలు ఉన్నాయో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. తాము తలుచుకుంటే ఒక్కరు కూడా బయట తిరగలేరని, మానుకోట రాళ్లకు మళ్లీ పని చెప్పే పని రానివ్వొద్దంటూ బీజేపీ శ్రేణులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ సూచించారు.