కరోనా బారిన పడిన మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

Friday, April 16th, 2021, 12:13:14 AM IST

ఏడాదిన్నర కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని విడిచి పెట్టడంలేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా ఎవరో ఒకరు కరోనా బారిన పడక తప్పడం లేదు. అయితే కొద్ది రోజుల నుంచి కరోనా సెకండ్ వేవ్ మరింత కలవరపడుతుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇవాళ ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాన‌ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. అయితే పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఎవ‌రూ త‌న‌ను కలవడానికి రావొద్ద‌ని సూచించారు. మ‌రోవైపు అంబేద్కర్ జయంతి సంద‌ర్బంగా తాండూరు పర్యటనలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోరారు.