తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా పాజిటివ్..!

Sunday, August 9th, 2020, 12:31:50 AM IST


తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండగా, కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేల జాబితా కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.

అయితే తాజాగా మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆయన ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా తనను కలిసిన కార్యకర్తలు, బంధువులు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని ఆయన కోరారు.