అనారోగ్యం తో తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

Tuesday, December 1st, 2020, 09:00:37 AM IST

తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మంగళవారం ఉదయం తెల్లవారుఝామున కన్నుమూశారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గా ఉన్న నోముల గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ ఉండటంతో అపోలో ఆసుపత్రి కి తరలించారు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది గా ఉండటం తో ఆయన ఉదయం ప్రాణాలను కోల్పోయారు. అయితే నోముల నరసింహయ్య మృతి పట్ల పలువురు తెరాస నేతలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పని చేసిన నాయకుడి గా ప్రజల్లో నిలిచి పోతారు అని కొనియాడారు. ఆయన మరణం ప్రజలకి, పార్టీ కి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్.