నా మాటలను మీడియా వక్రీకరించింది.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి క్లారిటీ..!

Thursday, December 17th, 2020, 02:00:26 AM IST

టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నిన్న సంక్షేమ పథకాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే సంక్షేమ పథకాల అమలుపై తాను చేసిన వ్యాఖ్యలపై లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్ధం చేసుకుని వక్రీకరించి ప్రసారం చేసిందని అన్నారు. పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు గుర్తుంచుకోవాలనే అర్థం వచ్చేలా మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని, మేలు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఆదరించాలని కోరినట్టు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మారెడ్డి జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటు ఉందని, ఏడాదిపాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరాలని తనకు ఉందని, 24 గంటల ఉచిత కరెంట్ కోతలు పెట్టి కేవలం 3, 4 గంటలు కరెంట్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలన్నిటిని ప్రస్తుతం నిలిపివేసి ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని మాట్లాడినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.