సన్‌రైజర్స్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం..!

Sunday, February 21st, 2021, 03:00:30 AM IST

ఐపీఎల్ 2021 వేలం ఇటీవల ముగిసింది. అయితే దీనిపై ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో హైదరాబాద్ ప్లేయర్లు లేకపోవడం దారుణమని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో దొరికిన ఆస్ట్రేలియా ఆటగాడు వార్నర్ కెప్టెన్‌గా ఉన్నాడని కానీ స్థానిక ఆటగాళ్లకు అవకాశం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

అయితే హైదరాబాద్‌లో సత్తా కలిగిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారని సన్‌రైజర్స్ జట్టులోకి స్థానిక ఆటగాళ్లను తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే జట్టులో స్థానిక ఆటగాళ్లకు స్థానం లేనప్పుడు జట్టు పేరును వెంటనే మార్చాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐపీఎల్‌ మినీ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఒక్క స్థానిక క్రికెటర్‌ను కూడా తీసుకోకపోవడంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజరుద్దీన్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.