టీఆర్ఎస్ పార్టీలో కరోనా కలకలం.. మరో మంత్రికి, ఎమ్మెల్యేకి..!

Saturday, August 8th, 2020, 08:30:28 PM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండగా, కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేల జాబితా కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు.

అయితే తాజాగా మరో మంత్రికి, ఎమ్మెల్యేకి కూడా కరోనా సోకింది. మంత్రి మల్లారెడ్డికి నేడు కరోనా నిర్ధారణ కాగా వైద్యుల సలహా మేరకు ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కూడా కరోనా సోకింది. ఆయనతో పాటు ఆయన భార్య, ఇద్దరు కొడుకులు, వంట మనిషికి కూడా కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యేతో సహా కుటుంబ సభ్యులంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.