వారిదే అధిపత్యం.. టీఆర్ఎస్ నేత స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు..!

Thursday, August 20th, 2020, 11:45:18 PM IST

టీఆర్ఎస్ నేత, శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల రాజకీయాలపై మాట్లాడిన ఆయన కొన్ని కులాలే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయని అన్నారు. అధికారం కూడా కొంతమందికే పరిమితమయ్యిందని అన్నారు. ఏకరూప సిద్ధాంతం దేశ రాజకీయాలలో అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

నేడు హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నారాయణ గురు జయంతి వేడుకలలో పాల్గొన్న స్వామి గౌడ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ నారాయణ గురు ఆశయాలను బడుగు బలహీన వర్గాల ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలని అన్నారు. నారాయణ గురు స్పూర్తితో అన్ని వర్గాల ప్రజలు ఐక్యం కావాలని, కుల, మత రాజకీయాలను పక్కన పెట్టాలని అన్నారు.