టీఆర్ఎస్ ఓటమి తట్టుకోలేక పార్టీ నేత గుండెపోటు తో మృతి!

Wednesday, November 11th, 2020, 08:21:33 AM IST

తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక లో టీఆర్ఎస్ ఓటమి పాలు అయిన సంగతి అందరికి తెలిసిందే. కౌంటింగ్ మొదటి నుండి బీజేపీ మరియు టీఆర్ఎస్ లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. అయితే చివరకు విజయం బీజేపీ నే వరించింది. అయితే ఈ ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి తట్టుకోలేక ఆ పార్టీ నేత గుండెపోటు తో మరణించారు.

పెద్దపల్లి జిల్లా, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం పరిధిలో టీఆర్ఎస్ నాయకుడు పులి సత్యనారాయణ రెడ్డి గుండెపోటు తో మరణించారు. ఓట్ల లెక్కింపు ను టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి స్థానిక బస్టాండ్ అవరణలో టీవీ లో చూస్తున్నారు. బీజేపీ గెలుపొందిన విషయాన్ని చూపించిన వెంటనే అక్కడికక్కడే కుప్పకూలారు. అయితే అక్కడి పార్టీ కి చెందిన నేతలు ఆసుపత్రికి తరలించే మార్గం లో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దిగ్బ్ర వ్యక్తం చేస్తున్నారు.