రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయం!

Wednesday, September 30th, 2020, 07:05:45 PM IST

ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం లో మంత్రి పాల్గొని ఓటు నమోదు చేసుకున్నారు.అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురి పెడితే ఏ ఎన్నిక అయినా తెరాస దే విజయం అంటూ పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఎన్ను ఉద్యోగాలు ఇచ్చారు అనేది పట్టభద్రుల కు చెప్పాలి అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అయితే కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్ లు తీసుకొని రావడం ద్వారా ఎక్కువ శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే అవకాశం కలిగింది అంటూ పేర్కొన్నారు.

అయితే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత గురించి, వైద్యం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కరోనా వైరస్ కి భయపడొడ్డు అని, అలానే నిర్లక్ష్యం కూడా పనికి రాదు అని అన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటేనే ఆసుపత్రి కి రావాలి అని మంత్రి వ్యాఖ్యానించారు.