టీఆర్ఎస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత..!

Friday, December 18th, 2020, 05:18:07 PM IST

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా కోలుకోకముందే అధికార టీఆర్ఎస్ పార్టీకి వరుసపెట్టి షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు అసంతృప్తి నేతలు పార్టీనీ వీడి బీజేపీ గూటికి చేరగా తాజాగా మరో నేత కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. కంటోన్మెంట్‌ మాజీ వైస్ చైర్మన్‌ జంపాన ప్రతాప్‌, బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌ బీజేపీ నేత మురళీధర్‌రావు సమక్షంలో పార్టీలో చేరారు.

ఏడాది కాలంగా బీజేపీకి చెందిన కొందరు సీనియర్‌ నాయకులు ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ వస్తున్నారు. అయితే దివంగత నేత పీజేఆర్‌ శిష్యుడిగా, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జంపన ప్రతాప్ కంటోన్మెంట్‌ రాజకీయాలపై మంచి పట్టు కలిగి ఉన్నారు. బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షునిగా, నామినేటెడ్‌ సభ్యుడిగా పదవులు నిర్వహించిన ఆయన ఇప్పుడు బీజేపీలో చేరడం టీఆర్ఎస్‌కు ఒకింత షాక్ అనే చెప్పాలి.