ఆ ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులకు షాక్.. బీ ఫామ్‌లు వెనక్కి..!

Saturday, November 21st, 2020, 01:47:15 AM IST


గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. అయితే మరోసారి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం 150 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపింది. అంతేకాదు తెలంగాణ భవన్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులందరికి మంత్రి కేటీఆర్ బీఫాంలను కూడా అందించారు. అయితే చివరి నిమిషంలో ముగ్గురు అభ్యర్థులకు టీఆర్ఎస్ పార్టీ షాకిచ్చింది.

అయితే ముగ్గురు అభ్యర్థులకు బీ ఫామ్‌లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంది. ఘాన్సీబజార్‌, లంగర్‌హౌస్, అహ్మద్‌నగర్‌ అభ్యర్థులను మార్చింది. మొదట జాబితాలో పేర్లు ప్రకటించిన వారికి కాకుండా ఇతరులకు బీ ఫారాలు అందజేసింది. ఘాన్సీబజార్ ‌స్థానంలో ఇశితకు బదులు గోపిగౌడ్‌కు, లంగర్‌హౌస్ స్థానంలో పార్వతమ్మకు బదులు భాగ్యలక్ష్మీకి, అహ్మద్‌నగర్‌ స్థానంలో సారికకు బదులు ఎస్‌. మమతలకు టికెట్లను కేటాయించిది. దీంతో ముందు తమ పేర్లను ప్రకటించి ఇలా సడెన్‌గా ఇతరులకు టికెట్లు ఇస్తున్నామని చెప్పడంతో ఆ ముగ్గురు అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు.