బండి సంజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్..!

Friday, November 20th, 2020, 07:28:11 PM IST

Bandi-Sanjay

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బండి సంజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీనీ కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి బీజేపీపై మండిపడ్డారు.

బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. కేసీఆర్‌ను దేశద్రోహి అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకొని బీజేపీ హైదరాబాద్‌కు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రశాంతమైన హైదరాబాద్ ప్రజలను మతవిద్వేషాలతో రెచ్చగొట్టొద్దని అన్నారు.