బిగ్ న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆధిక్యం కనబరుస్తున్న తెరాస

Thursday, March 18th, 2021, 08:06:32 AM IST

తెలంగాణ రాష్ట్రం లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభధ్రుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండో రౌండ్ ముగిసే సరికి తెరాస అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి సమీప ప్రత్యర్థి అయిన తీన్మార్ మల్లన్న కంటే 3,787 ఓట్ల ఆధిక్యంతో దూసుకు పోతున్నారు. అయితే రెండో రౌండ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి కి 15,857 ఓట్లు, తీన్మార్ మల్లన్న కి 12,070 ఓట్లు, తెజస అభ్యర్ద కోదండరాం కి 9,448 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డి కి 6,669 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ కి 3,244 ఓట్లు వచ్చాయి. అయితే తెరాస అభ్యర్ధి ఇక్కడ ముందంజ లో ఉండటం పట్ల పార్టీ శ్రేణులు ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు.

మరో పక్క హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు లో తెరాస అభ్యర్ధి అయిన వానిదేవి ముందంజ లో ఉన్నారు. ఎల్బి నగర్ లోని ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది. అయితే తొలి రౌండ్ లో వాణీ దేవి కి 17,439 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కి 16,385 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కి 8,357 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి కి 5,082 ఓట్లు వచ్చాయి. అయితే మొదటి రౌండ్ సైతం తెరాస స్వల్ప ఆధిక్యం లో ఉండటం తో ఎవరు గెలుస్తారు అన్న దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.