హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం..!

Saturday, March 20th, 2021, 05:49:46 PM IST

మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎట్టకేలకు అధికార పార్టీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుపై 11 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో పీవీ కుమార్తె సురభి వాణీదేవికి ఈ విజయం దక్కినట్టు తెలుస్తుంది. సురభి వాణీదేవి విజయాన్ని కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంతో గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ముందు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి, బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,49,269 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,37,566 ఓట్లు వచ్చాయి.