సాగర్ ఉపఎన్నిక కి నామినేషన్ దాఖలు చేసిన నోముల భగత్

Tuesday, March 30th, 2021, 01:46:29 PM IST

నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో బాగంగా నేడు అధికార పార్టీ తెరాస కి చెందిన అభ్యర్ధి నోముల భగత్ నిడమనూరు ఆర్వో కార్యాలయం లో తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే భగత్ నామినేషన్ కొరకు తెరాస కి చెందిన పలువురు కీలక నేతలు కూడా భగత్ తో కలిసి వెళ్ళారు. మంత్రులు, ఎమ్మెల్యే లు సైతం హాజరు కావడం గమనార్హం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ నిబంధనలు స్ట్రిక్ట్ గా అమలు చేస్తుండటం తో నామినేషన్ ప్రక్రియ సాదాసీదాగా సాగింది. అయితే నేడు సాయంత్రం మూడు గంటల వరకు కూడా సాగర్ ఉప ఎన్నిక కొరకు నామినేషన్ వేసేందుకు గడువు ఉంది. ఈ నెల 31 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా, ఏప్రిల్ మూడవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకి గడువు ఉంది. ఏప్రిల్ 17 న ఎన్నికలకు సంబంధించి పొలింగ్ జరగనుంది. మే రెండవ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ తో పాటుగా ఫలితాలు వెల్లడి కానున్నాయి.