టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్ రెడీ కాబోతున్నదా..?

Saturday, February 27th, 2016, 10:14:19 AM IST


టాలీవుడ్ ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రాల హవా నడుస్తున్నది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా హిట్ అయిన తరువాత మల్టీ స్టారర్ చిత్రాలవైపు టాలీవుడ్ దృష్టి సారించింది. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వెంకటేష్ గోపాల గోపాల వచ్చింది. అది కూడా సూపర్ హిట్ అయింది. అనంతరం అక్కినేని మూడు తరాల నటులు నటించిన మనం సినిమా హిట్ అయింది. ఇప్పుడు నాగార్జున, కార్తి నటించిన ఊపిరి వస్తున్నది.

ఇక ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. త్రివిక్రమ్ అ ఆ సినిమా విడుదల తరువాత, అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఓ కీలకపాత్ర ఉన్నదని.. ఆ పాత్రను నాగార్జునతో చేయించాలని అనుకుంటున్నారట. ఇది సెట్ అయితే మరో మల్టీస్టారర్ చిత్రం వచ్చినట్టే. ఇక త్రివిక్రమ్ సూర్యతో కూడా మూవీ చేయబోతున్నాడు. అ ఆ తరువాత ఒకవేళ గ్యాప్ కనుక ఉంటే ఆ గ్యాప్ లో త్రివిక్రమ్.. సూర్య ల సినిమా సెట్ పైకి వస్తుంది. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ మల్టీస్టారర్ సినిమా ఉంటుందని తెలుస్తున్నది.