గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన త్రిష..!

Saturday, October 3rd, 2020, 10:58:26 PM IST

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే నటుడు ప్రకాష్ రాజ్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరోయిన్ త్రిష తన ఫాంహౌస్‌లో మొక్కలు నాటారు. అయితే మొక్కలు నాటిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న త్రిష ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు పాటుపడాలని, పచ్చటి భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని విన్నవించారు.