కర్నూలులో విషాదం : ప్రేమికులరోజే యువకుడి ఆత్మహత్య

Friday, February 14th, 2020, 12:05:13 PM IST

నేడు ప్రేమికుల దినాన్ని పురస్కరించుకొని ప్రేమికులందరు కూడా తమ తోడుతో హ్యాపీగా గడుపుతున్న తరుణంలో కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కాగా ప్రేమికుల దినోత్సవం నాడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కృష్ణ అనే యువకుడు తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతుడు కృష్ణ ఎమ్మిగనూరులో ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే సాటి ప్రేమికులందరు కూడా తమ తోడుతో ఎంజాయ్ చేస్తుంటే, కేవలం తన ప్రేమ విఫలం అయిందన్న కారణంతో, తీవ్రమనోవేదనకు గురైన ఆ యువకుడు, ఆ తరువాత తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇలా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే స్థానికుల సహాయంతో సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేసుకొని విచారం చేపట్టారు.