2023 ఈటెల రాజేందర్ ను తప్పక ఒడిస్తా!

Saturday, September 19th, 2020, 12:51:22 AM IST


తెలంగాణ రాష్ట్రం లో అధికార పార్టీ తెరాస పై కాంగ్రెస్ పార్టీ వరుస విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ తీరును ఎండగడుతూ వరుస ప్రశ్నలు వేస్తూ, అధికార పార్టీ ను టార్గెట్ చేస్తూ టీపీసీసీ సెక్రెటరీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందారు. అయితే ప్రజా సమస్యల పై పోరాటం చేస్తుంటే అక్రమ కేసుల పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఈ మేరకు మీడియా సమావేశం లో మాట్లాడుతూ, 2023 లో తప్పక ఈటెల రాజేందర్ ను ఒడిస్తాను అని తెలిపారు. అలా ఒడించకుంటే తన పేరు కౌశిక్ కాదు అంటూ మీడియా ఎదుట సవాల్ విసిరారు. అయితే పదవి ఉంది కదా అని ప్రజలను ఇబ్బంది పెడితే, అంతకు మించి రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటా అని హెచ్చరికలు జారీ చేసారు.