బిగ్ న్యూస్: GHMC ఎన్నికల బరిలో మొత్తం 1,121 మంది పోటీ

Monday, November 23rd, 2020, 08:30:05 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు మొత్తం 1,121 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన సంగతి తెలిసిందే. గడువు ముగిశాక మొత్తం 1,121 మంది అభ్యర్థులు పోటీ లో నిలిచారు. అయితే దాదాపు 2,900 కి పైగా నామినేషన్లు దాఖలు కాగా, తిరస్కరణ, ఉపసంహరణ ల అనంతరం వీరే బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ, తెరాస, కాంగ్రెస్ 150 కి పైగా డివిజన్ లలో అభ్యర్ధులను నిలపగా, టీడీపీ నుండి 105 మంది బరిలో ఉన్నారు. ఎం ఐ ఎం నుండి 50 మంది వరకు బరిలో నిలవగా, ఇతర పార్టీలకు చెందిన వారు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం అయిదు వందలకి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. 74 లక్షల మంది ఓట్ల తో వీరి భవితవ్యం తేలనుంది. అయితే డిసెంబర్ 1 న ఇప్పటికే ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.