కుర్ర హీరోయిన్ తో క్రేజీ దర్శకుడి ప్రేమ పాఠాలు ?

Friday, June 1st, 2018, 11:33:45 AM IST

సినిమా రంగంలో ప్రేమాయణాలు సర్వ సాధారణమే , ఇప్పటికే ఇలాంటి వ్యవహారాల్లో పలువురు వార్తల్లోకి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. తాజగా టాలీవుడ్ లో మరో ప్రేమ వ్యవహారం ఆసక్తి రేపుతోంది. టాలీవుడ్ లో ఓ క్రేజీ దర్శకుడి .. ఓ పాపులర్ కుర్ర హీరోయిన్ తో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్త ఫిలిం వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. వీరిద్దరి వ్యవహవం పై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .

సదరు దర్శకుడు ఆ అమ్మడికి భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు ఇప్పుస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడట. షూటింగ్ లేని సమయాల్లో ఇద్దరు కలుస్తున్నారని. ముక్యంగా రాత్రి వేళల్లో వీరు పబ్బులు .. డిస్కోలంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారట. సదరు హీరోయిన్ కూడా ఆ దర్శకుడంటే ఇష్టమని .. అందుకే అతగాడు ఫోన్ చేయగానే .. వెంటనే వాలిపోతుందట. ఇక వీరి వ్యవహరమ్ పై ఇప్పటికే రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఆ దర్శకుడు ఎవరు .. అనేది మీరే ఉహించుకొండి.