ఏపీ లో రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికలు

Tuesday, February 16th, 2021, 09:15:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిశాయి. అయితే రేపు మూడో విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అభ్యర్దులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. రేపు 13 జిల్లాల్లో 20 డివిజన్ లలో 160 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఈ మూడవ విడత ఎన్నికల్లో ఇప్పటికే 579 పంచాయతీ లు, 11 వేల 732 వార్డ్ లు ఏకగ్రీవం అవ్వగా, మిగతా 3,221 పంచాయతీ లు, 19,607 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే సాయంత్రం నాలుగు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. కరోనా వైరస్ నియమ నిబంధనలు పాటిస్తూ ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాత్రి వరకు ఇందుకు సంబంధించిన ఫలితాలు వెల్లడవుతాయి.