బిగ్ న్యూస్: తెలంగాణ లో రేపటి నుండి లాక్ డౌన్

Tuesday, May 11th, 2021, 03:18:27 PM IST


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి లాక్ డౌన్ ను అమలు చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఉదయం 6 గంటల నుండి పది గంటల వరకు లాక్ డౌన్ నుండి మినహాయింపు ప్రకటించడం జరిగింది. నిత్యావసరాల కోసం, అత్యవసర పనుల కొరకు ఈ మినహాయింపు ఇవ్వడం జరిగింది. అయితే ఈ లాక్ డౌన్ పది రోజుల పాటు కొనసాగనుంది. అంతేకాక టీకా కోసం వెళ్ళే వారికి ఈ లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడం, మరణాలు పెరగడం, హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేయడం తో ఈ లాక్ డౌన్ కి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే అత్యవసర సేవలు మాత్రం పరిగణన లోకి తీసుకోనున్నారు. తెలంగాణ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం తో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరియు మరణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు లో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.