గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమయ్యింది. నదులు, చెరువులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలలోని చాల కాలనీలు నీట మునిగాయి. అయితే గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తుండడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే వరద భాదితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణమే విడుదల చేస్తూ అన్ని సహాయక చర్యలను చేపడుతుంది.
అయితే వ్యాపార, వాణిజ్య రంగాల వారు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు తమవంతు సహాయం అందించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో వరద బాధితులకు అండగా నిలిచేందుకు మేమున్నామంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలా మంది ముందుకు వస్తున్నారు. మెగస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి రూపాయలు, నాగార్జున 50 లక్షలు, ఎన్టీఆర్ 50 లక్షలు, రామ్ పోతినేని 25 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, హారికా హాసిని క్రియేషన్స్ 10 లక్షలు, త్రివిక్రమ్ 10 లక్షలు, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి చెరో 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.