ఏపీలో నేటి నుంచి స్కూళ్లు ఓపెన్.. మార్గదర్శకాలు ఇవే..!

Monday, September 21st, 2020, 07:27:44 AM IST

అన్‌లాక్ 4 లో భాగంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ నేటి నుంచి ఏపీలో స్కూళ్లు పునప్రారంభం కానున్నాయి. కంటైన్‌మెంట్ జోన్లను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాలలో స్కూళ్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేసింది. 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులు ఇళ్లలోనే ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు వినాలని, 9 నుంచి ఇంటర్ వరకూ విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళాల్సి ఉంటుంది.

అయితే రోజూ 50 శాతం మంది సిబ్బంది మాత్రమే స్కూళ్లకు, కాలేజీలకు హాజర్ కావాలని సూచించింది. ఇక విద్యార్థులు, టీచర్లు, ప్రిన్సిపల్స్ మరియు ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని విద్యాశాఖ తెలిపింది. అలాగే స్కూల్ గదులు, పరిసరాల్ని ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉండేలా చేయాలని, ప్రతి రోజూ శానిటైజ్ కూడా చేయాలని సూచించింది. స్కూళ్లకు వచ్చిన విద్యార్థులు ఎవరి పుస్తకాలు వాళ్లే చదువుకోవాలి. బుక్స్, పెన్స్, స్కేల్స్ వంటివి ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోకూడదని అన్నారు.