ఏపీలో 1.50 లక్షల కరోనా కేసులు.. నేడు ఎన్నంటే?

Saturday, August 1st, 2020, 07:10:32 PM IST


ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 60,797 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,276 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 57 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని 12,750 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,209కి పెరిగింది. అయితే అందులో 72,188 మంది చికిత్స పొందుతుండగా, 76,716 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1407కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20,12,573 శాంపిల్స్ పరీక్షించారు.