ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. నేడు రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు..!

Thursday, July 16th, 2020, 04:02:48 PM IST

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా, అదే స్థాయిలో కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. తాజాగా నేడు 22,304 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,584 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో 9 మందికి కరోనా సోకింది.

ఇదిలా ఉంటే నేడు కరోనా బారిన పడి 40 మంది మృత్యువాత పడ్డారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 35,451 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 16,621 మంది చికిత్స పొందుతుండగా, 18,378 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 452కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,17,963 శాంపిల్స్ పరీక్షించారు.