భారత్‌లో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 1,133 మంది మృతి..!

Tuesday, September 8th, 2020, 12:25:24 PM IST

india_corona

భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 75,809 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,80,423 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 8,83,697 యాక్టివ్ కేసులు ఉండగా, 33,23,951 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,133 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 72,775 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 73,521 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,98,621 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 77.65 శాతం ఉండగా, మరణాల రేటు 1.7 శాతంగా ఉంది.