ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా మరణాలు.. నేడు కేసులు ఎన్నంటే?

Saturday, August 8th, 2020, 06:49:51 PM IST

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా తాజాగా నేడు కూడా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 62,123 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,080 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 97 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని 9,151 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,17,040కి చేరగా అందులో 85,486 మంది చికిత్స పొందుతుండగా, 1,29,615 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,939కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,24,393 శాంపిల్స్ పరీక్షించారు.